Tuesday, 31 May 2016

Pesara Dose

పెసర దోసె
కావలసిన పదార్ధాలు:

పచ్చ పెసలు: 1 గ్లాస్



 బియ్యం: 1 గ్లాస్


అల్లం: చిన్న ముక్క


 జీలకర్ర:1 స్పూన్



 పచ్చిమిరపకాయ:4



 కొత్తిమీర: కొంచెం


 ఉప్పు:2 స్పూన్


నూనె: కాలదానికి సరిపడా


తయారీ విధానం:
ముందుగా పెసరపప్పు,బియ్యం ని నానపెట్టుకోవాలి. 4 గంటలు సరిపోతుంది. తరువాత మిక్సీ జార్ లో పెసరపప్పు, బియ్యం, పచ్చిమిరపకాయ, అల్లం, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర వేసి  బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.   తరువాత దోస పెనం మీద దోసల పోసుకొని ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే పెసర దోస రెడీ. ఇది అల్లం పచ్చడిలో  తింటే బాగుంటుంది.



Bendakaya Pachhadi

బెండకాయ పచ్చడి
కావలసిన పదార్ధాలు:

బెండకాయలు:6



 వంకాయలు:2


పచ్చిమిరపకాయలు:15(మీకు కారానికి  సరిపడినంత మిరపకాయలు వేసుకోండి.)



 టోమోటొస్:2


చింతపండు:చిన్న నిమ్మకాయంత


 వెల్లుల్లి:2 పాయలు



 ఉప్పు:2 స్పూన్స్


 చింతకాయ పచ్చడి : చిన్ననిమ్మకాయంత optinal



 తాలింపుగింజలు:1 స్పూన్


కరివేపాకు:2 రెమ్మలు


ఉల్లిపాయ:1


తయారీ విధానం:
గిన్నెలో కొంచెం నీళ్ళు పోసి పచ్చిమిరపకాయలు,వంకాయలు,బెండకాయలు వేసి ఉడికించుకోవాలి. ఉడికే అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అవి ఉడికిన తరువాత టొమాటో లు కుడా ఉడికించుకోవాలి అందులోనే. అవి అరిన తరువాత  మిక్సీ లో వేసుకొని చింతపండు or చింతకాయ పచ్చడి ,వెల్లుల్లి,ఉల్లిపాయ వేసి రఫ్గా మిక్స్ వేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఎండుమిర్రాపకాయలు తాలింపు  గింజలు,  కరివేపాకు వేసి ఈ పచ్చాడిని దానిలో వేసి కలుపుకొని స్టావ్ ఆపెయ్యలి.అన్తె బెండకాయ పచ్చడి రెడీ.వేడి వేడి అన్నంలో బాగుంటుంది.దోసలో కూడా తినవచ్చు.రాగి సంకటి,జొన్న సంకటి లోకి చాలా బాగుంటుంది.

Chintakaya Perugu Pachhadi

చింతకాయ పెరుగు పచ్చడి
 కావలసిన పదార్ధాలు:


చింతకాయ పచ్చడి: 1 పెద్ద ఆనియన్ అంత


 పచ్చిమిరపకాయలు: 10



వెల్లుల్లి:2


ఉల్లిపాయ:1


ఉప్పు:1 స్పూన్


 పెరుగు: 1 కప్



 తాలింపు గింజలు:1 స్పూన్


కరివేపాకు:2 రెమ్మలు


నూనె: 3స్పూన్స్



తయారీ విధానం: 
ముందుగా మిక్సీ జార్ లో,పచ్చిమిరపకాయలు,వెల్లుల్లి,ఉల్లిపాయ,చింతకాయ పచ్చడి వేసి కచ్చా పచ్చ గా (రఫ్) వేయాలి.  తరువాత  దానిని ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు ,పెరుగు కలపాలి. తరువాత  గిన్నెలో ఆయిల్వేసి ఆది కాగాక,తాలింపు గింజలు, ఎండు మిరపకాయ,కరివేపాకు,ఉల్లిపాయవేసి వేగాక  పచ్చడి దానిలో వేసి స్టవ్ ఆపెయ్యాలి. ఇది వేడి అన్నంలో చాలా బాగుంటుంది.




Chintakaya Pachhadi

చింతకాయ పచ్చడి
 కావలసిన పదార్ధాలు:
వేరుశనగ పప్పు: 1 టీ గ్లాస్

 ఎండుమిరపకాయలు:10

వెల్లుల్లి:3 పాయలు


 చింతపండు:కొంచెం


బెల్లం: చిన్న నిమ్మకాయంత



 జీలకర్ర: 1\2 స్పూన్



మినప్పప్పు: 1స్పూన్


దనియాలు:1 స్పూన్


నూనె : 2 స్పూన్స్



 ఉప్పు:1\2 స్పూన్


ఉల్లిపాయ:1


తయారీ విధానం: బాణలిలో నూనె వేసి ఆది కాగిన తరువాత ఎండు మిరపకాయలు,వేరుశనగ పప్పు, వేసి వెంఛాలి. అవి వేగక దనియాలు,మినపప్పు,జీలకర్ర వేసి వెంఛాలి. అవి వేగిన తరువాత పక్కన పెత్తుకొవలి.అవి చల్లారిన తరువాత మిక్సీ జార్ లో వేసుకోవాలి. దానిలోనే ఉల్లిపాయ,వెల్లుల్లి,చింతకాయ పచ్చడి,చింతపండు కొంచెం, బెల్లం,ఉప్పు  వేసి మిక్సీలో కొంచెం నీళ్ళు పోసి పేస్ట్ ల అయ్యే వరకు తిప్పండి.  చింతకాయ పచ్చడి రెడీ.




Gobi Munchurian

గొబీ మంచూరియ
కావలసిన పదార్ధాలు:


కౌలిఫ్లోవేర్ : 1



రెడ్డ్ ఫుడ్ కలర్ : చిటికెడు



ఉప్పు : 2 స్పూన్స్



గరం మసాలా:1\2 స్పూన్



కారం:1 స్పూన్


మిరియాల పొడి:1\2 స్పూన్


పచ్చిమిరపకాయలు:4



మైదా పిండి:1\4కేజీ



ఉల్లిపాయలు:2


టొమాటో సాస్:3  పెద్ద స్పూన్



సోయా సాస్:2 స్పూన్స్



చిల్లి సాస్ :2 స్పూన్స్



కరివేపాకు:2 రెమ్మలు



కొత్తిమీర: కొంచెం


అల్లం వెల్లుల్లి పేస్ట్:2 స్పూన్స్


నూనె:3 బిగ్ స్పూన్స్



మొక్కజొన్న పిండి:4 స్పూన్స్



తయారీ విదానం: గొబీ నికొంచెం పెద్ద ఫ్లవర్స్ గా కట్ చేసుకోవాలి. వాటిని వేడి నీళ్ళలో వేసి సగం ఉడికించుకోవాలి (half boil) .ఉడికేటప్పుడు ఉప్పు కొంచెం పసుపు  వేసి ఉడికించుకోవాలి .
తరువాత మైదా పిండిలో ఉప్పు,గరం మసాలా, కారం,మొక్కజొన్న పిండి, రెడ్ ఫుడ్ కలర్ వేసి నీళ్ళు పోసుకుంటూ బజ్జిలు పిండిల కలుపుకోవాలి. తరువాత కాడై లో నూనె పోసి అది కాగిన తరువాత ఆ పిండిలో ఉడికించిన గొబీ ముక్కలను ఒక్కొక్కటి డిప్ చేస్తూ ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
తరువాత వేరోక పాన్ తీసుకొని దానిలో నూనె 3 టేబల్ స్పూన్స్ పోసి దానిలో ఉల్లిపాయలు,పచ్చిమిరపకాయలు,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వెంచిన తరువాత కరివేపాకులు ,టోమోటొ సాస్,సోయా సాస్, చిల్లి సాస్ వేసి వెంచిన తరువాత  మిరియాల పొడి కొంచెం ఉప్పు వేసి కలుపుకొని తరువాత డీప్ ఫ్రై చేసుకున్న గొబీ వేసుకొని ఒక 5 నిమిషాలు కలుపుకొంటూ  కొత్తిమీర వేసి స్టోవ్ అపెయ్యాలి.ఇన్క గొబీ మంచురియా రెడీ.