చింతకాయ పెరుగు పచ్చడి
కావలసిన పదార్ధాలు:చింతకాయ పచ్చడి: 1 పెద్ద ఆనియన్ అంత
పచ్చిమిరపకాయలు: 10
వెల్లుల్లి:2
ఉల్లిపాయ:1
ఉప్పు:1 స్పూన్
పెరుగు: 1 కప్
తాలింపు గింజలు:1 స్పూన్
కరివేపాకు:2 రెమ్మలు
నూనె: 3స్పూన్స్
తయారీ విధానం:
ముందుగా మిక్సీ జార్ లో,పచ్చిమిరపకాయలు,వెల్లుల్లి,ఉల్లిపాయ,చింతకాయ పచ్చడి వేసి కచ్చా పచ్చ గా (రఫ్) వేయాలి. తరువాత దానిని ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు ,పెరుగు కలపాలి. తరువాత గిన్నెలో ఆయిల్వేసి ఆది కాగాక,తాలింపు గింజలు, ఎండు మిరపకాయ,కరివేపాకు,ఉల్లిపాయవేసి వేగాక పచ్చడి దానిలో వేసి స్టవ్ ఆపెయ్యాలి. ఇది వేడి అన్నంలో చాలా బాగుంటుంది.

No comments:
Post a Comment