పెసరపప్పు పొంగలీ (కార పొంగల్)
కావలసిన పదార్ధాలు:
పెసరపప్పు : 1 గ్లాస్
కరివేపాకు : 2 రెమ్మలు
పచ్చిమిరపకాయలు : 4
ఆవాలు : 1 స్పూన్
జీలకర్ర : 1 స్పూన్
ఎండుమిరపకాయలు : 2
నెయ్యి : 3 స్పూన్స్ or oil
మిరియాల పొడి : 1\2 స్పూన్
ఉల్లిపాయలు : 1 optional
జీడిపప్పు : 6 Optional
ఉప్పు: 1 1\2 స్పూన్
తయారీ విధానం:
కుక్కర్ లో 1 గ్లాస్ పెసరపప్పు, 3/4 గ్లాస్ బియ్యం వేసి , 6 గ్లాసస్ నీళ్ళు పోసుకోవాలి (అంటే 1 గ్లాస్ కి దాదాపు 3 and 1\2 గ్లాస్స్‌లు నీళ్ళు పోసుకోవాలి). 3 విసిల్స్ వచ్చిన తరువాత కుక్కర్ ఆపెయ్యాలి. ఆవిరి పోయిన తరువాత, విస్సేల్ తీసి ఉప్పు వేసి గరిటతో కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకొని దానిలో నెయ్యి లేక నూనె, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం ఆవాలు, పచ్చిమిరపకాయలు,జీడిపప్పు మరియు కరివేపాకు వేసి వేగిన తరువాత, కుక్కర్ లో మిక్సర్ ని దానిలో వేసుకొని ఉడుకించుకోవాలి. తరువాత మిరియాల పొడి,మిరియాలు కొంచెం వేసి కళిపెట్టాలి. ఇంకా స్టవ్ ఆపెయ్యాలి.వేడి వేడి పొంగల్ రెడీ.
చల్లారక ముందే తినండి చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment