గొబీ మంచూరియ
కావలసిన పదార్ధాలు:

కౌలిఫ్లోవేర్ : 1

రెడ్డ్ ఫుడ్ కలర్ : చిటికెడు

ఉప్పు : 2 స్పూన్స్

గరం మసాలా:1\2 స్పూన్

కారం:1 స్పూన్

మిరియాల పొడి:1\2 స్పూన్

పచ్చిమిరపకాయలు:4
మైదా పిండి:1\4కేజీ

ఉల్లిపాయలు:2

టొమాటో సాస్:3 పెద్ద స్పూన్
సోయా సాస్:2 స్పూన్స్

చిల్లి సాస్ :2 స్పూన్స్
కరివేపాకు:2 రెమ్మలు

కొత్తిమీర: కొంచెం

అల్లం వెల్లుల్లి పేస్ట్:2 స్పూన్స్

నూనె:3 బిగ్ స్పూన్స్
మొక్కజొన్న పిండి:4 స్పూన్స్
తయారీ విదానం: గొబీ నికొంచెం పెద్ద ఫ్లవర్స్ గా కట్ చేసుకోవాలి. వాటిని వేడి నీళ్ళలో వేసి సగం ఉడికించుకోవాలి (half boil) .ఉడికేటప్పుడు ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి .
తరువాత మైదా పిండిలో ఉప్పు,గరం మసాలా, కారం,మొక్కజొన్న పిండి, రెడ్ ఫుడ్ కలర్ వేసి నీళ్ళు పోసుకుంటూ బజ్జిలు పిండిల కలుపుకోవాలి. తరువాత కాడై లో నూనె పోసి అది కాగిన తరువాత ఆ పిండిలో ఉడికించిన గొబీ ముక్కలను ఒక్కొక్కటి డిప్ చేస్తూ ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
తరువాత వేరోక పాన్ తీసుకొని దానిలో నూనె 3 టేబల్ స్పూన్స్ పోసి దానిలో ఉల్లిపాయలు,పచ్చిమిరపకాయలు,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వెంచిన తరువాత కరివేపాకులు ,టోమోటొ సాస్,సోయా సాస్, చిల్లి సాస్ వేసి వెంచిన తరువాత మిరియాల పొడి కొంచెం ఉప్పు వేసి కలుపుకొని తరువాత డీప్ ఫ్రై చేసుకున్న గొబీ వేసుకొని ఒక 5 నిమిషాలు కలుపుకొంటూ కొత్తిమీర వేసి స్టోవ్ అపెయ్యాలి.ఇన్క గొబీ మంచురియా రెడీ.