రాగి సంకటి
కావలసిన పదార్ధాలు:రాగి పిండి :1 కప్
నూకలు(బ్రోకెన్ రైస్):1 కప్
నీళ్ళు:5 కప్స్
ఉప్పు:2 స్పూన్స్
తయారీ విదానం:
ఒక గిన్నెలో 5 కప్స్ నీళ్ళు పోసుకొని దానిలో నూకలు వేసి ఒక అర గంట నానపెట్టుకోండి. తరువాత ఆ గిన్నెను గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తరువాత ఉప్పు వేసి పప్పు గుత్తతో బాగా మెత్తగా నేనుపుకోవాలి. రాగి పిండి ని కొద్దిగా చల్లా నీళ్ళలో కలుపుకొని దానిని ఉడికించుకున్న అన్నంలో వేసి బాగా కలియ పెట్టాలి. 5 నిమిషాలు ఉడికిన తరువాత స్టవ్ ఆపెయ్యలి. దీనిని పచ్చడితో,చికన్ తో లేదా సంబర్‌తో గాని తింటే చాలా బాగుంటుంది. మజ్జిగలో కూడా తినవచ్చు.

No comments:
Post a Comment